ఏరియా ఆస్పత్రి కి డయాలిసిస్ సెంటర్ మంజూరు.
జనం సాక్షి జోగిపేటఆందోల్ ఏరియా ఆసుపత్రి లో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలంటూ ఏం ఎల్ ఏ క్రాంతి కిరణ్ చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించింది. డయాలిసిస్ సెంటర్ లేకపోవడం వల్ల నియోజకవర్గంలో డయాలిసిస్ చేయించుకునే పేషంట్ లు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించారు. డయాలిసిస్ సెంటర్ ఏర్పాటుకు వుత్తర్వులు జారీ చేశారు.
మంత్రి గారికి ధన్యవాదాలు
డయాలిసిస్ సెంటర్ మంజూరు చేసినందుకు మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఏం ఎల్ ఏ క్రాంతి కిరణ్. నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పథకాలతో పాటు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న డయాలిసిస్ సెంటర్ ను అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.