ఏళ్లు గడిచినా విచారణ కొనసాగాల్సిందే

న్యూడిల్లీ: రైల్వేశాఖ మాజీ మంత్రి ఎల్‌.ఎన్‌.మిశ్రా హత్య కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ విషయం తెలిపింది. మిశ్రా హత్య కేసు విచారణను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 37 ఏళ్లుగా విచారణ జరుగుతున్నా ఇంకా ఒక ముగింపుకు రాలేదన్న కారణంతో కేసును కొట్టివేయలేమని పెర్కొంది. 1975లో బీహర్‌ సమిష్టిపూర్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన బాంబు పేలుడులో మిశ్రా మృతి చెందాడు. అప్పుడు ఆయన రైల్వే మంత్రిగా ఉన్నారు.