ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

నల్లగొండ: ట్రాన్స్‌ఫారం కోసం అడిగిన రైతు నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటూ చందాపేట ఏఈ సంతోష్‌కుమార్ ఏసీబీకి చిక్కాడు. కరెంటు మోటరు కనెక్షన్ కోసం డీడీలు కట్టామని, తమకు ట్రాన్స్‌ఫారం మంజూరు చేయాలని అడిగిన రైతును సంతోష్‌కుమార్ రూ. 25 వేలు లంచ అడిగాడు. అఖరికి రూ. 15 వేలకు బేరం కుదుర్చుకున్నారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏఈపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు రైతు తెచ్చిన ఫోన్ రికార్డును పరిశీలించారు. అనంతరం రైతుకు ఫౌడర్ పూసిన వెయ్యి రూపాయల నోట్లు 15 ఇచ్చి రైతును ఏఈ వద్దకు పంపారు. రైతు నుంచి సంతోష్‌కుమార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హైండేడ్‌గా పట్టుకున్నారు.