ఏ పార్టీ విరాళాలకు రశీదులు ఇవ్వదు.జేపీ

తణుకు: రాజకీయ పక్షాల నిర్వహణకు డబ్బు అవసరమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. రాజకీయ పక్షాలు వందల, వేల కోట్ల రూపాయాలను తమ కార్యాకలాపాల నిర్వహణకు వసూలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిఆ్ల తణుకులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సత్తా పార్టీ మినహా ఏ రాజకీయ పార్టీ కూడా తాము వసూలు చేసిన విరాళాలను రశీదులు ఇవ్వవని తెలిపారు. వేయి కోట్ల విరాళాలు వస్తే తొమ్మిది వందల కోట్ల రూపాయలు హుండీ ఆదాయంగా చూపిస్తారని వ్యంగంగా అన్నారు. లోక్‌సత్తా పార్టీకి రూపాయి విరాళం ఇచ్చినా వారికి రశీదు ఇవ్వటంతో పాటు ఆదాయపన్ను మినహాయింపు కలిగేలా చేస్తోందని వివరించారు.