ఐఎస్‌ఎస్‌కు చేరిన సునీత

హ్యూస్థన్‌: భారత-అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)ను చేరుకున్నారు. ఆమె మరోర వ్యోమగాములతో కలిసి మంగళవారం తమ సోయజ్‌ వ్యోమనౌకను విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తో అనుసంధానం చేశారు. ఈ కేంద్రంలో వారు నాలుగు నెలల పాటు ఉంటారు. దాదాపు 30 ప్రయోగాలు నిర్వహిస్తారు.
సునీతా విలియమ్స్‌తో పాటు రష్యాకు చెంవదిన సోయజ్‌ కమాండర్‌ యూరి మాలెన్‌చెంకో, జపాన్‌ అంతరిక్ష సంస్థకు చెందిన ఫ్లైట్‌ ఇంజనీర్‌ అకిహికో హోషిడేలు ఆదివారం కణకస్థాన్లఓని బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి రోదసిలోకి పయమనమైన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు కక్ష్యలో గడిపిన అనంతరం భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.21గంటలకు ఐఎస్‌ఎస్‌లోని రసావెట్‌ మాడ్యూల్‌తో సోయజ్‌ డాక్‌ అయ్యింది. ఈ ప్రక్రీయ అనంతరం ”అంతా సాఫీగా ఉంది.” అని సోయజ్‌ కమాండర్‌ యూరి మాలెన్‌చెంకో..రస్యా మిషన్‌ కంట్రోల్‌ కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఈ ముగ్గురు వ్యోమగాములు ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఉన్నగెన్నాడీ వడాల్కా సెర్గెయ్‌ రెవిన్‌, జో అకాబాలతో కలిసి రెండు నెలలు పనిచేస్తారు. సెప్టెంబర్‌ 17న అకాబా, పడాల్కా రెవిన్‌లు భూమికి పయనమవుతారు. ఇప్పటి నుంచి సునీత ఐఎస్‌ఎస్‌ కమాండర్‌గా వ్యవహరిస్తారు. సునీతా విలియమ్స్‌కు ఇది రెండో అంతరిక్ష యాత్ర ఇప్పటికే అత్యధిక కాలం (195 రోజులు) అంతరిక్ష్యంలో గడిపిన మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. తాజా యాత్ర సందర్భంగా మరో నాలుగు నెలల పాటు అంతరిక్షంలో గడవం ద్వారా ఆమె తన రికార్డును మరింత మెరుగు పరుచుకోనున్నారు.