ఐకెపి ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ

వినుకొండ, జూన్‌ 28 : ఐకెపి ఆధ్వర్యంలో 2011-12 ఆర్థిక సంవత్సర ఉపకార వేతనాలను పలు గ్రామాల్లో గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ ఎసిడి పాల్గొన్నారు. గ్రామ సమైక్య సంఘాల సభ్యులు ఇందిరా జీవిత బీమా, వైఎస్‌ అభయహస్తం సభ్యత్వాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఇలా చేస్తే సమైక్య సంఘాలలోని సభ్యులకు ఉపకార వేతనాలు అందుతాయని అన్నారు. సభ్యులు తప్పనిసరిగా తమ పిల్లల విద్యార్హత సర్టిఫికెట్లను ఐకెపి కార్యాలయంలో అందించాలని డిఆర్‌డిఎ ఎసిడి ఒక ప్రకటనలో కోరారు. అనంతరం ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం యొహోవా మండల అధ్యక్షురాలు, కోశాధికారి, బండ్లమోటు నవోదయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.