ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొంజేటి ఎన్నిక పట్ల హర్షం


హుజూర్ నగర్ మార్చి 21 (జనంసాక్షి) : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మూడోసారి హ్యాట్రిక్ సాధించిన కొంజేటి సత్యనారాయణ ఎన్నిక పట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పైన గత 40 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నడని అన్నారు. సత్యనారాయణ ఎన్నికతో జాతీయస్థాయిలో జర్నలిస్టు ఉద్యమం మరింతగా బలోపేతం అవుతుందన్నారు. యూనియన్ బలోపేతానికి ఆయన ఎన్నిక మరింత ఉపయోగపడుతుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక జర్నలిస్టు ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచాడన్నారు. కల్లూరు సారధ్యంలో జర్నలిస్టులు మరిన్ని పోరాటాలు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీవీఎల్, బాసవోజు శ్రీనివాసచారి, దాచేపల్లి దయాకర్ రెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్ రావు, కిత రామనాథం, దేనుమ కొండ శేషంరాజు, దేవరం రాంరెడ్డి, వెంకటరెడ్డి, కోమరాజు అంజయ్య ఇట్టి మల్ల రామకృష్ణ, ఇందిరాల రామకృష్ణ, బాచి మంచి చంద్రశేఖర్ పాల్గొన్నారు.