ఐదు వన్డేల సిరీస్‌ భారత్‌ వశం

కొలంబో: శ్రీలంకతో జరిగిన ఐదువన్డేల సరీస్‌ను భారత్‌ కైవశం చేసుకుంది. మంగళవారం శ్రీలంకతో జరిగిన నాలుగోవన్డేలో భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో ఐదువన్డేల సరీస్‌లో భారత్‌కు 3-1 ఆధిక్యం లభించింది. 252 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ గంభీర్‌ పరుగులఖాతాను ప్రారంభించకుండానే పెవిలియస్‌ చేరుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి సెహ్వాగ్‌తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. 52 పరుగుల వద్ద భాదత్‌ సెహ్వాగ్‌ వికెట్‌ కోల్పోయింది. అనంతరం వచ్చిన రోహిత్‌శర్మ 4 పరుగులకే వెనుదిరిగాడు. ఎంకే తివారీ కొద్డిసేపు కోహ్లికు అండగా వున్నాడు. భారత్‌ స్కోరు 109 వద్ద తివారీ ఎల్బీడబ్ల్యు అయ్యాడు. 109 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయి కష్లాల్లో ఉన్న భారత్‌ పరిస్థితి రైనా రాకతో పూర్తిగా మారిపోయింది. రైనా, కోహ్లిలు సమన్వయంతో ఆడటంతో 42.2 ఓవర్లలో 255 పరుగులు సాధించారు. దీంతో శ్రీలంకపై భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదుచేసింది. స్టార్‌బ్యాట్స్‌మెన్‌ కోహ్లి 119 బంతుల్లో 128 పరుగులు సాధించి అజెయంగా నిలిచాడు. ఇది కోహ్లికి 13వ శతకం. ఇదే సిరీస్‌లో రెండో శతకం కావడం విశేషం. రైనా 51 బంతుల్లో 58 పరుగులు చేసి కోహ్లికు అండగా నిలిచాడు. శ్రీలంక బౌలర్లు మలింగ, మాధ్యూస్‌, ప్రదీప్‌, మెండిస్‌లు చెరో వికెట్‌ సాధించారు.