ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు అవగాహన సదస్సు…
టేకుమట్ల.సెప్టెంబర్23(జనం సాక్షి)మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కిషోర బాలికలకు పోషణ మాసం సందర్భంగా పోషకాహార ప్రాముఖ్యత గురించి ఐసిడిఎస్ సూపర్వైజర్ సరోజ పాఠశాల విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగాఐసిడిఎస్ సూపర్వైజర్ సరోజ మాట్లాడుతూ విద్యార్థినిలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని,పరిసరాల పరిశుభ్రత పాటించాలని, బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవాలని,అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారాలను తీసుకోవాలని, ఆకుకూరలు,పండ్లు,పాలు, పీచు పదార్థాలు,ఐరన్ సంబంధిత ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలని, రక్తహీనతకు గురికాకుండా, ఉషకాహార లోపాన్ని గురికాకుండా ఆరోగ్యంగా ఉంటూ చదువుతూ చక్కటి శ్రద్ధతో చదువుకోవాలని బాలికలు అన్ని రంగాల్లో అగ్రస్థానం పొందాలని, సత్ప్రవర్తంతో చదువు పట్ల శ్రద్ధ చూపుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వీడియోస్ సూపర్వైజర్ సరోజ పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు,అంగన్వాడి టీచర్లు భాగ్యలక్ష్మి,స్వప్న,తిరుమల, స్వరూప,నిర్మల,విమల,వనిత,తదితరులు పాల్గొన్నారు.