ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సంగక్కార నంబర్ వన్
న్యూఢిల్లీ, జూలై 6 : శ్రీలంక ఆటగాడు కుమార్ సంగక్కార్ ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మొదటిస్థానం సంపాదించారు. అంతకు ముందు వెస్టిండీస్‌కు చెందిన శివనారాయణ్ చంద్రపాల్ అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు సంగక్కార ఆ స్థానాన్ని ఆక్రమించారు. కొలంబోలో జరిగిన మ్చాచ్‌లో పాక్‌కు వ్యతిరేకంగా ఆడారు. సెంచరీ సాధించారు. దాంతో కుమార్‌కు 42 రేటింగ్స్ లభించాయి. ఇప్పటికి మొత్తం 938 రేటింగ్ పాయింట్లను కుమార్ సాధించుకున్నారు. గత వారం జరిగిన గాలే టెస్ట్‌లో మాటాలేకు చెందిన 34 ఏళ్ల ఈ ఆటగాడు 199 పరుగులను చేశారు. రెండు టెస్ట్ మ్యాచ్‌లలో 113 రేటింగ్స్ సాధించారు.