పోచంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, జనవరి 27 (జనం సాక్షి): పట్టణ కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రాంనగర్ కాలనీ పరిధిలోని 11వ వార్డులో యాదవ సంఘం భవన నిర్మాణానికి, 5వ వార్డు బీసీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తడక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భారత లవ కుమార్, మండల అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కళ్లెం రాఘవ రెడ్డి, జిల్లా నాయకులు సామ మధుసూదన్ రెడ్డి, తడక రమేష్, బాత్క శంకర్ యాదవ్‌తో తదితరులు పాల్గొన్నారు.



