ఒక వ్యక్తి దారుణ హత్య

కడప, జూలై 26 : కడప జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువులోని సాయి వైన్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. మండలంలోని పొత్తుకూరుపల్లెకు చెందిన బసిరెడ్డి (39) మేనేజర్‌గా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి షాపు మూసి, షాపు బయటే నింద్రించారు. గురువారం తెల్లవారు జామున గ్రామస్తులు ఆయన మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. సాయివైన్స్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న బసిరెడ్డికి అదే షాపులో పని చేస్తున్న మరో మేనేజర్‌కు మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయమై గతంలో షాపు యజమాన్ని మహేశ్వర్‌రెడ్డి ఇరువురి మధ్య సయోధ్యం చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి కూడా వారిరువురు ఘర్షణ పడ్డారని పోలీసులకు సమాచారం అందింది. సంఘటనాస్థలాన్ని పులివెందుల డిఎస్పీ జయచంద్రుడు సందర్శించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని లక్కిరెడ్డిపల్లి సిఐ వెంకటరాయుడు చెప్పారు.