పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నిరసన
అబ్దుల్లాపూర్ మెట్ (జనం సాక్షి ): పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మేట్ ఎంఆర్వో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరుసగా వంట గ్యాస్ ధరలను పెంచుతూ సాధారణ ప్రజలపై భారాన్ని మోపుతోందన్నారు. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా గ్యాస్ ధరల పెంపు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు మరింత భారమైందన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు. ధరల పెరుగుదలతో ప్రజల జీవనం కష్టమైందని పేర్కొన్నారు. అలాగే కార్మిక సంఘాలపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి హెరాసింగ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మన్ తదితర నాయకులు పాల్గొన్నారు.



