ఏక పక్ష నిర్ణయంతో సస్పెండ్ చేయడం సరికాదు

కాంగ్రెస్ నాయకులు జంగిలి వెంకటేశ్వర్లు, కొదమగుండ్ల నాగరాజు.

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. రామాపురం 07 వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసే వారిని కాదని రెండు మూడు పార్టీలు మారిన వ్యక్తికి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ బి పామ్ కేటాయించారని మాజీ సర్పంచ్ జంగిలి వెంకటేశ్వర్లు,ఎస్సీ సెల్ మాజీ ఉపాధ్యక్షుడు కొదమగుండ్ల నాగరాజు ను పార్టీ నుండి తమని సస్పెండ్ చేయడం ఏమాత్రం న్యాయం కాదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీఎమ్మెల్యే ,ఎంపీ ఎలక్షన్లో ,పార్టీ గెలుపు కోసం ఎన్నోసార్లు కృషి చేశామని, రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిపై వ్యతిరేకత ఉందని మండలం మండల పార్టీ నాయకులకు తెలియజేశామని,అయినా తమ మాటలను మండల పార్టీ నాయకులు ఏమాత్రం పట్టించుకోకుండా అభ్యర్థికి బి ఫామ్ ఇచ్చారని పార్టీ బీఫామ్ వచ్చిన దగ్గర నుండి పార్టీలో గతంలో పనిచేసిన వారితో సమన్వయం,లేకోకుండా అభ్యర్థి సరైన ప్రచారం చేయకుండా ఇప్పుడు తమ ఓటమికి మేము కారణమని, మా మీద దుష్ప్రచారం చేస్తూ రానున్న రోజుల్లో తన అక్రమాలకు ఫైరవులకు,కాంగ్రెస్ పార్టీలో తనకు అడ్డు ఎవరు లేకోకుండా ఈవిధంగా చేస్తున్నాడని మొదటి సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి, బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వక పోక, ఇండిపెండెంట్ పోటీ చేసి ఓడిపోయారని, ప్రస్తుతం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ బి పామ్ పొంది, ప్రజా వ్యతిరేకతతో ఓడిపోయారని,ఓడిపోయిన వ్యక్తి మాటలు వినకుండా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూర్తిగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా పత్రిక ప్రకటన ద్వారా నాయకులను అడుగుతున్నామన్నారు.

తాజావార్తలు