ఒడిశాలో బంద్‌ కారణంగా.. పలాసలో నిలిచిన రైళ్లు

శ్రీకాకుళం: ఒడిశాలో బంద్‌ కారణంగా శ్రీకాకుళం జిల్లా వలాసలో దురంతో, వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒడిశాలో బిజద ప్రభుత్వ అవినీతి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది.