ఒడ్డున పడ్డ చేపలా ఉంది నా పరిస్థితి: ప్రణబ్‌ ముఖర్జీ

భువనేశ్వర్‌: రాష్ట్రపతి అభ్యర్థిగా అందరి మద్దతు కోరుతూ రాష్ట్రాల పర్యటనలో బిజీగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీ తనకు మాత్రం ప్రస్తుత పరిస్థితి ఒడ్డున పడి గిలగిలలాడుతున్న చేపలా ఉందంటున్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాల్సి రావడాన్ని ఆయన ఈ విధంగా అభివర్ణించారు.కాంగ్రెస్‌లో చిన్న కార్యకర్తగా రాజకీయ కెరీర్‌ ప్రారంభించిన తాను అంచెలంలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చానని ఒడిశాలోని ఎమ్మేల్యేలతూ మాట్లాడుతూ ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. సీడబ్ల్యూసీలో చాలాకాలం కొనసాగిన తాను ప్రస్తుతం కాంగ్రెస్‌ వ్యక్తిని కానని, మంత్రి పదవి లేదని…తనకంటూ ఒక ఐడెంటిటీ లేదని నవ్వుతూ చెప్పారు. రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నామినేషన్‌ వేయడానికి ముందు ఆయన అన్ని పదవులకూ రాజీనామా చేశారు.