ఒసామా బిన్ లాడెన్ ఇంట్లో.. ‘ద స్టోరీ ఆఫ్ ఇండియా’ వీడియో
– అనేక వీడియో సీడీల జాబితాను విడుదల చేసిన సీఐఏ
హైదరాబాద్,నవంబర్2(జనంసాక్షి) : అమెరికాలో సెప్టెంబర్ లెవన్ దాడులకు కారణమైన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఇంట్లో లభ్యమైన అనేక వీడియో సీడీల జాబితాను తాజాగా సీఐఏ వెల్లడించింది. అయితే ఆ
వీడియో కలెక్షన్‌లో.. ‘ద స్టోరీ ఆఫ్ ఇండియా’ కూడా ఉన్నది. అనేక హాలీవుడ్ సినిమాలతో పాటు కొన్ని దేశాలకు చెందిన చారిత్రాత్మక వీడియోలు కూడా ఆల్ ఖయిదా నేత ఒసామా ఇంట్లో ఉన్నట్లు సీఐఏ వెల్లడించింది. మన దేశంపై బీబీసీ ఛానల్ రూపొందించిన ‘ద స్టోరీ ఆఫ్ ఇండియా’ కూడా లాడెన్ లైబ్రరీలో ఉంది. చరిత్రకారుడు మైఖేల్ వుడ్ ‘ద స్టోరీ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ తీశాడు. దీన్ని మొత్తం ఆరు ఎపిసోడ్‌లుగా 2007 ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ప్రసారం చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాలు స్వాతంత్యం పొంది 60ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ సిరీస్‌ను ప్రసారం చేశారు. భారత దేశంలోని చరిత్రాత్మక ప్రదేశాలను విజిట్ చేస్తూ ఆ ప్రాంతాలను ఈ డాక్యుమెంటరీలో రచయిత వర్ణిస్తాడు. ఒక్క మన దేశ సమాచారమే కాకుండా, లాడెన్ ఇంట్లో దొరికిన వాటిల్లో కొన్ని మిగతా దేశాలకు చెందిన నాగరికత వీడియోలు కూడా ఉన్నాయి. వివిధ సంస్కృతులు, జాతులపై ఎన్జీసీ రూపొందించిన ప్రోగ్రామ్‌లు కూడా ఆ లిస్టులో ఉన్నాయి. చిన్న పిల్లలు అమితంగా ఇష్టపడే ఆంట్జ్, కార్స్ లాంటి హాలీవుడ్ యానిమేషన్ చిత్రాలు కూడా లాడెన్ ఇంట్లో దొరకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. తనపై అంతర్జాతీయ ఛానళ్లు రూపొందించిన డాక్యుమెంటరీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆంట్జ్, బ్యాట్‌మన్ గోథమ్ నైట్, బీబీసీ గ్రేట్ వైల్డ్‌ర్ మూమెంట్స్, బయోగ్రఫీ-ఒసామా బిన్ లాడెన్, కార్స్, చికెన్ లిటిల్, సీసీఎన్ ప్రజెంట్స్.. వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్, ్గ/నైల్ ఫాంటసీ 7, హీరోస్ ఆఫ్ టుమారో, ¬మ్ ఆన్ ద రేంజ్, ఐస్ ఏజ్ – డాన్ ఆఫ్ ద డైనోసర్స్, ఇన్ ద ఫూట్ స్టెప్స్ ఆఫ్ బిన్ లాడెన్, ఎన్జీసీ-కుంగ్‌ఫూ కిల్లర్స్, ఎన్జీసీ-ఇన్‌సైడ్ ద గ్రీన్ బీరట్స్, ఎన్జీసీ-ప్రిడేటర్స్ ఎట్ వార్, ఎన్జీసీ-వరల్డ్స్ వరస్ట్ వీనమ్, పెరూ సివిలైజేషన్, రెసిడెంట్ ఈవిల్, స్టామ్ర్ రైడర్-క్లాష్ ఆఫ్ ద ఈవిల్స్, ద క్రెమ్లిన్ ఫ్రమ్ ఇన్‌సైడ్, ద స్టోరీ ఆఫ్ ఇండియా, ద త్రీ మస్కీటర్స్, వేర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వీడియోలు ఆల్ ఖయిదా చీఫ్ ఇంట్లో దొరికాయి. ఉగ్రవాద సంస్థలు తమ దాడులకు ఎలా ప్రణాళికలు వేస్తాయన్న అంశాన్ని తెలియపరిచేందుకు ఒసామా పత్రాలను రిలీజ్ చేస్తున్నట్లు సీఐఏ వెల్లడించింది. సెప్టెంబర్ లెవన్ దాడులకు మాస్టర్‌మైండ్ అయిన ఒసామా బిన్ లాడెన్ చాన్నళ్లు అమెరికాకు చిక్కకుండా తప్పించుకున్నాడు. మే 2, 2011న అమెరికా నేవీ సీల్స్ అతన్ని తుద ముట్టించాయి. ఇటీవలే మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన రీల్స్‌ను కూడా
సీఐఏ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.



