ఓటు హక్కు వినియోగించుకున్న గాయపడ్డ వ్యక్తి

వరంగల్ ఈస్ట్, నవంబర్ 30 (జనం సాక్షి)

వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేటకు చెందిన బేల శ్యామ్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గాయపడ్డాడు. అయినా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆసక్తితో రంగసాయిపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాల లో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇక్కడ ఏర్పాటుచేసిన వీల్ చైర్లలో సిబ్బంది అతన్ని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓటు వేయించడం కనిపించింది. ఈ కార్యక్రమంలో చీఫ్ నోడల్ ఆఫీసర్ కోలా రాజేష్, రమేష్ తోపాటు వేల శ్యామ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.