ఓడిపోతామనే అక్కసుతోనే ఛార్జీల భారం దత్తాత్రేయ

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో  ఓడిపోతామనే అక్కసుతోనే ప్రజలపై ముఖ్యమంత్రి విద్యుత్తు ఛార్జీల భారం మోపారని భాజపా సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కిరణ్‌ పాలనలో రాష్ట్రంల ఆంధ్రకారప్రదేశ్‌గా మారిందని ఆరోపించారు.