ఓయూలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తం

tllcu05uహైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రకటన విడుదల చేయాలని కోరుతూ ఓయూ నిరుద్యోగ ఐకాస చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆర్ట్స్‌ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారిపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. కొందరు విద్యార్థులు ముళ్లకంచెను దాటుకుని పరుగులు తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఓయూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.