ఓయూ స్నాతకోత్సవాలకు తెలంగాణ సెగ
హైదరాబాద్: ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న ఓయూ 79వ స్నాతకోత్సవాలకు తెలంగాణ సెగ తగిలింది. గవర్నర్ రాకను నిరసిస్తూ ఇవాళ క్యాంపస్ బంద్‌కు పీడీఎస్‌యూ పిలుపు నిచ్చిన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఈ స్నాతోత్సవానికి దూరంగా ఉన్నారు. పాండురంగారెడ్డి రీసెర్చ్ స్కాలర్ తెలంగాణ వచ్చేవరకు తన డాక్టరెట్‌ను స్వీకరించనని పట్టాను తిరిగిఇచ్చేశారు. డాక్టరెట్ పట్టాలను పొందిన వారు స్టేజీపైన జై తెలంగాణ నినాదాలు చేశారు.