ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో ప్రమాదం: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఈ రోజు తెల్లవారుజామున మరో ప్రమాదం జరిగింది. రాత్రి శామీర్‌పేట ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మాజీ మంత్రి కుమారుడు మరణించిన సంగతి తెలిసిందే. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లినుంచి లోడుతో పటాన్‌చెరు బయల్దేరిన లారీ శంషాబాద్‌ వద్ద ఔటర్‌ రింగురోడ్డుపై ముందు వెళ్తున్న మరో లారీని ఢీకొట్టింది. ఈప్రమాదంలో లారీ డ్రైవర్‌ సురేందర్‌ రెడ్డితో పాటు క్లీనర్‌ బిక్యానాయక్‌ అక్కడికక్కడే మృతి చెందారు.