కట్టంకూరి లక్ష్మయ్య పార్దివదేహానికి నివాళులార్పించిన రజక సంఘం నాయకులు రఘునాథ పాలెం

 

 

 

 

 

 

కొత్తగూడెం గ్రామ సమైక్య రజక సంఘం నాయకులు కట్టంకూరి లక్ష్మయ్య అకాల మరణం పొందారు. కొత్తగూడెం లోని ఆయన నివాసం వద్ద ఉంచిన పార్థివదేహానికి రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులార్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాప, సానుభూతి ని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో రజక సంఘం నాయకులు జక్కుల వెంకటరమణ, నగర కన్వీనర్ కణతాల నరసింహారావు, నగర ముఖ్య నాయకులు వట్టికోట దర్గయ్య, తంగెళ్లపల్లి శ్రీనివాస్, లాండ్రి షాపుల సంఘం నగర కన్వీనర్ పంతంగి రవి కుమార్, కట్టంకూరి సోమయ్య, భూమా రామారావు, ఎల్లవుల శ్రీను, బాసాటి వెంకన్న, భూమా గురవయ్య, తాల్లూరి శ్రీను, తాల్లూరి వెంకన్న, భూమా జానీ, భూమా రమేష్, పంతంగి రమేష్, తదితరులు పాల్గొన్నారు.