కడప రిమ్స్‌ సమీపంలో ఉద్రిక్తత

కడప : కడప సమీపంలోని పుట్లంపల్లి చెరువు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ స్థలం ఆక్రమణల తొలగింపుకు అధికారులు సమాయత్నం అయ్యారు. రిమ్స్‌ దగ్గర చెరువు స్థలాన్ని ఆక్రమించి స్థానికులు వేసుకున్న గుడారాలను పోలీసులు బలవంతంగా తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు, పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు గుడిసెల తొలగించినట్లు ఆర్గీవో వీరబ్రహ్మం తెలిపారు. మరోవైపు తాము ఎక్కడ బతకాలంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.