కనువిందు చేసిన శ్రీనివాస కల్యాణం

కాకినాడ,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): మండపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో తితిదే ఆధ్వర్యంలో ఏడిదలోని దాసరి నారాయణరావు ట్టస్ర్‌ పర్యవేక్షణలో శ్రీనివాస కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన అశేష భక్తజనంతో పట్టణంలో ఆధ్యాత్మికశోభ నెలకొంది. అన్నమాచార్య కీర్తనలు మైరమపించాయి. రద్దీకారణంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు ఏర్పాటుచేసి గట్టి బందోబస్తు నిర్వహించారు. దూరంగా ఉండేవారు కల్యాణాన్ని తిలకించేందుకు వీలుగా రెండు పెద్దపెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ తిరుపతి నుంచి తెప్పించిన ప్రసాదాన్ని పంపిణీ చేశారు.