కరవుపై నేడు మంత్రుల కమిటీ సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో అనేక రాష్ట్రాల్లో వర్షపాతం ఆశించినస్థాయిలో లేకపోవటం, అనేక ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొనటంతో దీనిపై ఈరోజు కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. వ్యవసాయమంత్రి శరద్‌పవార్‌ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేకంగా  ఏర్పాటుచేసిన  మంత్రుల కమిటీ కరువుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తోంది. మన దేశంనుంచి ఎగుమతి అయ్యే బియ్యం, పత్తి, మొక్కజొన్న, గోధుమ, పంచదార వంటి వాటిపై నియంత్రణ విధించే విషయం, ఎఫ్‌సీఐలో ఉన్న నిల్వల, వర్షాభావంతో ఏర్పడనున్న తాగునీటిఎద్దడిపై చర్చిస్తారు. వర్షాభావం  ఎక్కువగా ఉన్న  తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలకు ప్రత్యేక నిధుల కేటాయింపు, ఆయా రాష్ట్రాల్లో కరవుబృందం  పర్యటన తేదీల ఖరారుపై చర్చిస్తారు.