కరాచీ ఆగ్ని ప్రమాదంలో 100కి చేరిన మృతుల సంఖ్య
కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ వస్త్ర పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ ఆగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 100కి చేరింది. 50 మంది క్షతగాత్రులు కరాచీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం అర్థరాత్రి కరాచీలోని హబ్‌రివర్ రోడ్‌లోని వస్త్ర పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో పలువురు కార్మికులు ప్యాక్టరీలోనే చిక్కుకుపోవడంతో ప్రాణనష్టం భారీగా చోటుచేసుకుంది. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు కార్మికులు ప్యాక్టరీ కిటికీల నుంచి కిందికి దూకి తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్‌లోని ఓ షూ ప్యాక్టరీలో జరిగిన మరో అగ్నిప్రమాదంలో 25 మంది కార్మికులు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.



