కరీంనగర్‌ జిల్లాలో బంద్‌ సంపూర్ణం

కరీంనగర్‌, జులై 24 (జనంసాక్షి):  చేనేత దీక్ష పేరుతో సోమవారం సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్య క్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షపై  నిరసనలు తెలిపిన తెలంగాణ వాదు లపై లాఠీ చార్జీలు, దాడులను నిరసిస్తూ మంగళవారం టీఆర్‌ఎస్‌ బంద్‌కు పిలుపు నిచ్చింది. ఈ బంద్‌కు జేఏసీ మద్దతు పలుకడంతో జిల్లా కేంద్రం లోని వాణిజ్య, వ్యాపార సంస్థలతో పాటు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, బ్యాంకులు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ఆర్టీసీ డిపో ముందు బైటాయించి బస్సులను బైటకు పోకుండా అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో మధ్యాహ్నం వరకు బస్సులు రోడ్డెక్క లేదు. పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులను మూసి వేశారు. న్యాయ వాదులు కోర్టులను బహిష్కరించి తమ నిరసనలను తెలియజేశారు. తెలంగాణ చౌక్‌లో టీఆర్‌ఎస్‌ గిరిజన విద్యార్థి సంఘాలు, శాతవాహన విశ్వ విద్యాలయం ఐక్యకార్యాచరణ సమితి, సీపీఐ న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ఆందోళన చేపట్టారు. సీమాంధ్ర గూండాలపై తెలంగాణలో ప్రవేశించి తెలంగాణ వాదులు, మహిళల, విద్యార్థులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ  చార్జీలు జరుపడం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీమాంధ్ర పాలక వర్గం ముఖ్యమంత్రి టీఎల్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ  వాదులపై దాడులు జరుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు దీనికి తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వాదులు రోడ్లపై బైటాయించి ఆందోళనలు చేపట్టారు. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేసి ప్రజలు బంద్‌కు మద్దతు పలికారు. పలు చోట్ల బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. ఎక్కడ ఆవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తూ చేపట్టారు. సాయంత్రం వరకు బంద్‌ కొనసాగడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురైనారు. బంద్‌ ప్రశాంత ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

గోదావరిఖనిలో….

తెలంగాణ భవన్‌లో విద్యార్థులపై, సిరిసిల్లాలో సీమాంధ్రులు విద్యార్థులు, మహిళలపై చేసిన దాడికి నిరసనగా మంగళవారం టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. టిఆర్‌ఎస్‌ నాయకులు పారిశ్రామిక ప్రాంతంలో పలువీధుల గుండా బైక్‌ర్యాలీ నిర్వహిస్తు… పెద్దయెత్తున తెలంగాణ నినా దాలు చేశారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ కార్పొరేషన్‌ ఏరియా అధ్యక్షులు గుంపుల ఓదేలుయాదవ్‌ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంను అడ్డుకో వడానికి కాంగ్రెస్‌ పార్టీ, వైఎస్సార్‌సిపి కుట్ర చేస్తుందన్నారు. విజయమ్మ సిరిసిల్ల దీక్షలో పోలీసులు, రాయలసీమ గుండాలు విచక్షణారహితంగా విద్యార్థుల, తెలంగాణావాదులు, మహిళలపై దాడి జరిపారన్నారు. ఇప్ప టికైనా… కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిం చాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామన్నారు. కాగా, కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో… స్థానిక ఆర్టీసి డిపో ముందు తెలంగాణావాదులు ధర్నా నిర్వహించారు. బస్సులు బయటకు రాకుండా… ప్రధాన గేట్‌కు తాళం వేశారు. పోలీసుల చర్యలను నిరసిం చారు. ఇదేసమయంలో అక్కడికి చేరుకున్ని పోలీసులు కోరుకంటి చందర్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిక్కినేని నర్సింగరావు, దీటి బాలరాజు, చెరుకు బుచ్చిరెడ్డి, ఉల్లంగుల రమేష్‌, బక్కి కిషన్‌, మారుతి, దాసరి ఎల్లయ్య, రంగు బ్రహ్మం, అజీం, ప్రసాద్‌, రామగిరి రాము, ఎం.శ్రీనివాస్‌, అనీతాచౌదరి, రత్నాకర్‌, పాపయ్య, ఈదునూరి నర్సింగ్‌, భూషణ్‌హరి, బత్తుల శ్రీనువాస్‌, జనగామ స్వామి, సులోచన, విజయలక్ష్మి, పెంట రాజేష్‌, తోడేటి శంకర్‌గౌడ్‌, నూతి తిరుపతి, బొడ్డు రవీందర్‌, కళావతి, కృష్ణవేణి, ముక్కెర రాజేశం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా… టిఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యం లో… స్థానిక మార్కండేయకాలనీలోని విద్యార్థి జేఏసి ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెలకలపల్లి శ్రీనివాస్‌, చెల్పూరి సతీష్‌, ఆరెపల్లి నరేష్‌, ముప్పు సురేష్‌, తోట హరీష్‌, మేర్గు రాము, రాజేదర్‌, శ్రావణ్‌, అమీర్‌, ప్రశాంత్‌, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు. అలాగే టిబిజికేఎస్‌ ఆధ్వర్యంలో… జిడికే-5వ బొగ్గుగనిలో నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి… జెండాలతో పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిబిజికేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య, నాయకులు బొల్లపల్లి అంతయ్య, రెంటాల అర్జున్‌, దామోదర్‌రావు, రాజేశ్వర్‌రావు, నారాయణ, దాసరి దుర్గరాం ప్రసాద్‌, సర్వర్‌, సుదర్శన్‌రెడ్డి, గోశికరవి, ఉపేందర్‌, కనకం రాజయ్య, సాంబయ్య, అయిలయ్య, రామస్వామి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

పోలీసు కస్టడీలో పూజలు…

బంద్‌ సందర్భంగా… పోలీసులు అదుపులో ఉన్న ఓ నాయకుడు వారి పహారాలో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ దృశ్యం ఆశ్చర్యం కలిగించగా… టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కోరుకంటి చందర్‌ గత రెండు రోజులుగా పోలీసు అదుపులో ఉన్నాడు. మంగళవారం కావడంతో… సదరు నాయకుడిని ప్రత్యేక వాహనంలో పోలీసులు తోడ్కోని వచ్చి దేవాలయంలో పూజలు నిర్వహింపచేయడం జరిగింది.

సీమాంధ్రప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం…తెలంగాణ ప్రజలపై సీమాం ధ్రప్ర భుత్వం జరిపిన దాడికి నిరసనగా… భారత కమ్యూనిస్ట్‌ పార్టీ పెద్దపల్లి డివిజన్‌ కమిటి ఆధ్వర్యంలో…

మంగళవారం ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక ప్రధాన చౌరస్తాలో దగ్దం చేశారు. వైఎస్సార్‌సిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లలో చేపట్టిన దీక్షకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం వత్తాసు పలికి పోలీసు బలగాలతో, రాయలసీమ రౌడీలతో తెలంగాణ విద్యార్థులు, మహిళలపై విచక్షణా రహి తంగా దాడులు జరపడం హేయమైన చర్య అని పార్టీ బాధ్యులు అన్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే… సీమాంధ్ర నేతలు తెలంగాణ గడ్డపై అడుగుపెట్టాలని హెచ్చరించారు. పెద్దపల్లి డివిజన్‌ కార్యదర్శి కె.రాజన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు నరేస్‌, జిఎస్‌ ఎన్‌.రెడ్డి, ఎస్‌కె.బాబు, మల్లేశ్‌, రమేష్‌, పద్మ, అశోక్‌, రాజు, మోజోష్‌లతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఎన్టీపీసీలో టిఆర్‌ఎస్‌ శ్రేణుల రాస్తారోకో… జ్యోతినగర్‌:

తెలంగాణ ప్రజలపై సీమాంధ్ర ప్రభుత్వం, వెస్సార్‌సిపి శ్రేణులు చేసిన దాడికి నిరసనగా… మంగళవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌ రాజీవ్‌ రహదారిపై టిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో… రాస్తారోకో చేశారు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తు… ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసుల ప్రకాష్‌, కేవి.చందు, కుమ్మరి శ్రీనివా స్‌, ఈదునూరి పర్వతాలు, కంకటి రవిగౌడ్‌, ఈదునూరి శంకర్‌, మామి డాల చంద్రయ్య, శ్రీను, వంశీ, మల్లేశ్‌, రాంచందర్‌, తూం పద్మలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

సెంటినరికాలనీలో బంద్‌ సంపూర్ణం…

కమాన్‌పూర్‌ మండల పరిధిలోని సెంటినరికాలనీ బేగంపేట్‌ గ్రామంలో మంగళవారం వ్యాపారులు స్వచ్చందంగా బంద్‌ నిర్వహించారు. తెలంగాణ ప్రజలపై సీమాంధ్రప్రభుత్వం, వైఎస్సార్‌సిపి శ్రేణులు సోమవారం చేసిన దాడికి నిరసనగా… టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బేగంపేట్‌ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంటా వెంకట రమణారెడ్డి, కాపరబోయిన భాస్కర్‌, వేగోలపు మల్లయ్య, మామిడి స్వామి, దామోదర్‌, రాజు, రమేష్‌, సమ్మయ్య, రవిబాబు తదితరులు పాల్గొన్నారు.

కార్మిక కాలనీలో బంద్‌…యైటింక్లయిన్‌కాలనీ:

కార్మికవాడల్లో టిఆర్‌ఎస్‌ ఇచ్చిన బంద్‌ విజయవంతమైంది.కాలనీ టౌన్‌షి ప్‌లోని అన్ని వాణిజ్య, విద్యాసంస్థలను మూసివేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌, దాని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంపూర్ణ బంద్‌బసంత్‌నగర్‌:

టిఆర్‌ఎస్‌ పిలుపు మేరకు బసంత్‌నగర్‌లో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలోని అన్ని వాణిజ్య, విద్యాసంస్థలను మూసివేశారు. బసంత్‌నగర్‌ పరిసర గ్రామాల్లో సైతం బంద్‌ ప్రభావం కనిపించింది. ఈ కార్యక్రమంలో నాయకులు గౌరిమోహన్‌, బుట్టి శ్రీధర్‌, ఖాదర్‌, సట్ల అశోక్‌, తిరుపతి, ముప్పల కృష్ణ, మేడం రాజు, సంతోష్‌, మేడం విద్యాసాగర్‌, దేవేందర్‌, కమలాకర్‌, లక్ష్మణ్‌, బెక్కం శంకర్‌ తది తరులు పాల్గొన్నారు.

వేములవాడల్లో…

సిరిసిల్లాలో తెలంగాణావాదులపై పోలీసుల దౌర్జన్యకాండకు నిరసనగా టిఆర్‌ఎస్‌ ఇచ్చిన పిలుపు మేరకు వేములవాడలో మంగళవారం నాడు బంద్‌ సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛం దంగా మూసివేయగా, పట్టణంలోని సినిమాహాళ్ళు, పెట్రోలు బంకులు, ఇతర వాణిజ్య సముదాయాలు కూడా మూతపడ్డాయి.. పట్టణంలోని కళాశా లలు, పాఠశాలల విద్యార్థులందరూ బంద్‌కు సంఘీభావంగా పాఠశాలలకు వెళ్ళకపోవడంతో వాటిని మూసివేశారు. బంద్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిం చారు. కాగా కోరుట్ల బస్టాండ్‌ సమీపంలో తెరిచిఉన్న కొన్ని దుకాణాలను మూసివేయించడానికి ప్రయత్నించిన టిఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, దుకాణాదా రులకు మధ్య కొద్ది సేపు ఘర్షణ జరగిన అనంతరం వాటిని కూడా మూసివేశారు. రాజన్న ఆలయ ప్రధానద్వారం వద్ద టిఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున తెలంగాణా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయ కులు ఎర్రం మహేశ్‌, మాదాడి గజానందరావులు మాట్లాడుతూ, సిరిసిల్లాలో బలవంతంగా దీక్ష చేసేందుకు ప్రయత్నించిన వైఎస్‌ఆర్‌ సిపి నాయకురాలు విజయమ్మ దీక్ష తెలంగాణా నిరసనల మధ్య పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. కాగా తెలంగాణావాదులపై పోలీసుల దైర్జన్యకాండకు నిరసనగా పట్టణంలో బంద్‌ విజయవంతం చేసినందుకు వ్యాపార వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నాయకులు పీచర భాస్కర్‌రావు, టిఆర్‌ఎస్‌వి విద్యార్థి విభాగం నాయకులు వెంగళ శ్రీకాంత్‌ గౌడ్‌, నిమ్మశెట్టి విజయ్‌, సార్ల చారిలతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగిత్యాల బంద్‌ ప్రశాంతం…

జగిత్యాల టౌన్‌,జూలై24 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ కాంగెస్‌ పార్టీ అద్యక్షురాలు విజయలక్ష్మి నేతకార్మికల సమస్యల పేరుతో సిరిసిల్లలో పర్యటించడాన్ని  నిరశిస్తూ కరీంనగర్‌ బంద్‌కు మద్దతుగా జగిత్యాలలో దుకాణాదారులు, విద్యాసంస్థలు బంద్‌ను పాటించారు. జగిత్యాల టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు బస్సులను అడ్డుకుని తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో విజయమ్మ ధర్నా, సభను అడ్డుకున్న తెలంగాణ వాదులపై అక్రమకేసులు బనాయించడం పై వారు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పట్టణంలో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. బస్సులను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సులను అడ్డుకున్నవారిలో టిఆర్‌ఎస్‌ జిల్లా కార్యదర్శి సింగారావు, నాచుపెల్లిరెడ్డి, నర్సన్న, భీమయ్య, చందసాయి, పడిగెల రవీంధర్‌ రెడ్డి, రాజు, ప్రశాంత్‌ తదితరులున్నారు.