కరీంనగర్‌ జిల్లాలో విజిలెన్స్‌ దాడులు

కరీంనగర్‌ : అక్రమంగా ధాన్యం నిలువ చేశారనే పక్క సమాచారంతో విజిలెన్సు అధికారులు విజృభించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. వేములవాడలో జరిపిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 30 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్లలో రెండు రేషన్‌షాపులపై దాడి చేసి అక్రమ ధాన్యాలు ఉండడంతో వాటిని సీజ్‌ చేశారు.