కరీంనగర్: ‘ఏఐఎస్‌ఎఫ్ వార్షికోత్సవాలు జయప్రదం చేయాలి’
టవర్‌సర్కిల్ : అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) 80వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి బోనగిరి మహేందర్ అన్నారు. సోమవారం 80వ వార్షికోత్సవ వాల్ పోస్టర్లను స్థానిక బద్ధం ఎల్లారెడ్డి భవవన్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12, 13, 14 తేదీల్లో 80వ వార్షికోత్సవాలను జాతీయ సమితి ఆధ్వర్యంలో తిరుపతిపట్టణంలో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై చర్చించడంతోపాటు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, నగర అధ్యక్షుడు కోటోజు వివేక్, సహాయ కార్యదర్శుల సందానాల కార్తీక్, పెద్ది సాయికిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.