కరీంనగర్: ఠాణాలో చిత్ర హింసలపై ఎస్పీకి ఫిర్యాదు
మహాముత్తారం : మండలంలోని యామన్‌పల్లి గ్రామానికి చెందిన బీజేపీ మండలాధ్యక్షుడు పిలుమర్రి సంపత్‌ను కొమురంభీం విగ్రహ ధ్వంసం ఘటనతో సంబంధం ఉందంటూ అన్యాయంగా మహాముత్తారం ఠా ణాకు తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేసిన సంఘటనపై ఆదివారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీసా అర్జున్‌రావు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణరెడ్డిలు ఫోన్‌లో తెలిపారు. బాధితుడు సంపత్‌తో ఎస్పీని కలిసి మహాముత్తారం పోలీసులు ఏ విధంగా చిత్ర హింసలకు గురిచేశారో తెలిపామన్నారు. విచారణ జరిపి రెండు రోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.