కర్ణాటకలోని రాయచూరు థర్మల్‌ పవర్‌ కేంద్రంకు 250 కోట్ల జరిమానా

రాయచూరు: కర్ణాటకలోని రాయచూరు థర్మల్‌ పవర్‌ కేంద్రం 8వ యూనిట్‌ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్‌కు రూ 250 కోట్ల జరిమానా విధించి, 8వ యూనిట్‌లో లోపం వల్ల ప్రతిరోజు జరిగే నష్టం 250 మెగావాట్ల ఉత్పాదన నష్టాన్ని బీహెచ్‌ఈఎల్‌ భరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి శోభా కరంద్లాజె వెల్లడించారు. యూనిట్‌ మరమ్మతులను సొంత ఖర్చుతో చేసి రాబోవు రెండు మాసాల్లో విధ్యుదుత్పాదన ప్రారంభించాలని ఆ కంపెనీకి సూచించినట్లు మంత్రి చెప్పారు.