కర్ణాటకలో 10 మంది మంత్రులు రాజీనామా

బెంగుళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి సదానంద గౌడ్‌ను మార్చాలని డిమాండ్‌ చేస్తు 10 మంది మంత్రుల రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి సదానంద గౌడకు అందజేశారు.
రాజీనామా చేసిన మంత్రులు: జగదీష్‌ షెట్టర్‌, శోభా కరద్లాజె, రేణుకాచార్య, సి.ఎం.ఉదాసీ, నాయక బెడమగి, రాజుగౌడ, వి.సోమణ్ణ, మురుగేష్‌ నిరానీ, బసవరాజు బొమ్మయ్‌, ఉమేష్‌ కట్టి.