కర్నాటక సిఎంగా జగదీష్‌షెట్టర్‌ ప్రమాణస్వీకారం

బెంగళూరు, జూలై 12(: కర్నాటక నూతన ముఖ్యమంత్రిగా జగదీష్‌ షెట్టర్‌ గురువారంనాడు 11.56 గంటల సమయంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ భరద్వాజ్‌ రాజ్‌భవన్‌లో ఆయన చేత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా కెఎస్‌ ఈశ్వరప్ప, ఆర్‌. అశోక్‌ కూడా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రితో సహా 32మందితో కర్నాటకలో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. జగదీష్‌ షెట్టర్‌ కర్నాటకకు 27వముఖ్యమంత్రి. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, అనంతరాం, బిజెపి సీనియర్‌ నేతలు, తదితరులు విచ్చేశారు.