కర్నూలుజిల్లాలోని జిందాల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
కర్నూలు, మార్చి 16: జిల్లాలోని గడివేముల దగ్గర ఉన్న జిందాల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా పాత కేబుల్ వైర్లు తగలబడినట్లు తెలిసింది. అంతేకాకుండా అక్కడ నిల్వ ఉంచిన డ్రమ్ములు కూడా కాలి బూడిదైనట్లు ఫ్యాక్టరీ సిబ్బంది తెలిపారు.