కర్నూలులో కాంట్రాక్ట్ లెక్చరర్ హత్య
కర్నూలు : కర్నూలులో రవి అనే కాంట్రాక్ట్ లెక్చరర్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. గూడూరుకు చెందిన రవి స్థానిక సైదాపూర్ కాలనీలోని ఓ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కాగా పేపర్ వాల్యుయేషన్ నిమిత్తం ఆదివారం కర్నూలుకు వచ్చిన అతడు హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. దుండగులు రవి తలపై బండరాయితో మోది హతమార్చినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు విచారణ జరుపుతున్నారు.



