కలప గోదాంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: ఆసిఫ్‌నగర్‌లోని కలప గోదాంలో సోమవారం ఆర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గోదాంలో మంటలు చెలరేగడంతో కలప అగ్నికి ఆహుతయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు శకటాలతో గంట సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యుట్‌ కారణంగానే ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్ని మాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంలో భారీగానే ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

తాజావార్తలు