కలెక్టర్‌కు వృద్ధుల సంక్షేమ సంఘం వినతి

కరీంనగర్‌ టౌన్‌, జూలై 16 (జనంసాక్షి) : కోరుట్ల పట్టణంలో వృద్ధుల సంక్షేమ సంఘం నివాసం కోసం ఆశ్రమానికి మూడెకరాల భూమిని ఇప్పించాలని కోరుట్ల వృద్ధ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. అక్టోబర్‌ 2, 2009 గాంధీ జయంతి రోజు వృద్ధులందరూ కలిసి సంఘం ఏర్పాటు చేసుకుని రిజిష్ట్రేషన్‌ చేసుకున్నామని అధ్యక్షుడు ఆడేపు రాజగంగరాం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సంఘంలో 450 మంది వృద్ధులు సభ్యులున్నారని, అక్టోబర్‌ 2 నుంచి 2011 వరకు అనాథ వృద్ధులకు ప్రతి నెల రూ.200/-ల పింఛన్‌ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గోనె రాజరాం, ప్రధాన కార్యదర్శి చిలుక గంగరాం తదితరులు పాల్గొన్నారు.