కల్తీకల్లు ఘటనపై విచారణకు సీఎం ఆదేశం

మెదక్‌: జిల్లాలోని పెదచిట్యాలలో కల్తీకల్లు తాగి 12 మంది అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. బాధితులకు పూర్తిస్థాయిలో వైద్య సహాయం అందించాలని ఫోన్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌కు సూచించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.