కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ…. ఎమ్మెల్యే మదన్ రెడ్డి

చిలప్ చేడ్/మర్చి/జనంసాక్షి :- మండలంలోని శిలాంపల్లి రైతు వేదిక వద్ద ఏర్పాటుచేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మంచి మనసున్న మహారాజు అని ప్రతి ఇంటి ఆడబిడ్డను తన ఇంటి బిడ్డగా భావించి వారికి పెళ్లి కానుకగా 1,00116 అందిస్తున్నారని అన్నారు ఇక ముందు పెళ్లిళ్లు చేసుకునే ప్రతి ఆడబిడ్డ ముందు ముందే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తు చేసుకుంటే వారికి నేరుగా పెళ్లి మండపంలోనే చెక్కులు ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు అనంతరం మండల సర్వసభ సమావేశంలో పాల్గొని సమావేశంలో సర్పంచులకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తెలియజేసినారు ఏ ఒక్క సర్పంచ్ కూడా నారాజ్ కాకుండా ఉండాలని వారి ఆర్థిక ఇబ్బందులను మార్చి నెలాఖరులోగా సీఎం గారితో మాట్లాడి నెరవేరుస్తానని సర్పంచులకు ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి తెలియజేస్తున్నానని వారికి హామీ ఇచ్చినారు అలాగే మండలంలోని అన్ని గ్రామాలలో మంజూరైన సిసి రోడ్లు కంప్లీట్ గా పూర్తి చేసుకున్నామని అన్నారు మండలంలో పాఠశాలలకు సంబంధించి గౌతాపూర్ చిట్కుల్ పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు కోటి రూపాయలు చొప్పున మంజూరు చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి పనుల కొరకు త్వరలోనే టెండర్లను పిలిచి వాటిని కూడా పూర్తి చేయిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గారెడ్డి ఎంపీడీవో శశి ప్రభ వైసిపి విశ్వాంబరస్వామి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సుభాష్ రెడ్డి సర్పంచుల ఫోరం అధ్యక్షులు లక్ష్మీ దుర్గా రెడ్డి పిఆర్ ఏఈ మధుబాబు ఏపీవో శ్యాం కుమార్ అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్ర