కవాతులో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుంది: భాజపా

హైదరాబాద్‌: తెలంగాణ కవాతు (సాగర హారం)లో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొంటే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని భాజపా పేర్కొంది. ఐకాస నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సర్కారు కవాతుగా మార్చాలనుకుంటోదని ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది, ప్రభుత్వం అనుమతి ఇచ్చినా పోలీసుల దౌర్జన్యం కొనసాగుతోందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కవాతును శాంతియుతంగా జరిపి విజయవంతం చేయాలన్నారు. ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కవాతులో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొనడం సరికాదని విద్యాసాగరరావు అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆ పార్టీయే అడ్డుకుంటోందని మరోవైపు ఇక్కడి నాయకులు మాత్రం హడావిడి చేస్తూ నాటకాలు ఆడారని విమర్శించారు. ఎలాగైనా ఐకాసలోకి ప్రజాక్షేత్రం లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కవాతుకు అనుమతిచ్చినా జిల్లాల్లో అరెస్టులు జరుగుతున్నాయని దీనికి మంత్రులే బాధ్యత వహించాలని రాజేశ్వరరావు అన్నారు.