కవాతు విధ్వంస ఘటనలపై కేసులు నమోదు

హైదరాబాద్‌: నెక్లెస్‌రోడ్డులో నిన్న జరిగిన తెలంగాణ కవాతు సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంస ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. పలు ఘటనలపై రాంగోపాల్‌ఫేట, సైఫాబాద్‌ పోలీసుస్టేషన్లలో ఇప్పటివరకు 10 కేసులను నమోదు చేశారు. విధ్వంసానికి సంబంధంచి సీసీఎస్‌ సిట్‌ పోలీసులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు.