కాంగ్రెసును గెలిపిస్తేనే అభివృద్ధి
– మాజీ మంత్రి కొండా సురేఖ
– 28వ డివిజన్లో ఉత్సాహంగా పాదయాత్ర
వరంగల్ ఈస్ట్ మార్చి 18 (జనం సాక్షి)ఇటు రాష్ట్రంలో అటు దేశంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తేనే అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు పాదయాత్రలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 28వ డివిజన్లో శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరించారు ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. అవినీతి రహిత పాలనను అందించే కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఉండాలని కోరారు. ప్రజల కష్టాల్లో బాధల్లో తోడు నీడగా ఉండే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని సురేఖ విజ్ఞప్తి చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కురిమిళ్ళ సంపత్ ప్రకాష్ చెన్న మల్లు, సత్యం, బత్తుల వినోద్ తోపాటు సీనియర్ నాయకులు నల్గొండ రమేష్, చిప్ప వెంకటేశ్వర్లు, షేర్ల కిషోర్, శివ, కృష్ణ, మురళి స్వప్న, పుష్ప, రాజేష్, వసీం, ముద్దసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.