కాంగ్రెస్‌కు ప్లీనరీగా తెలుగు మహాసభలు ప్రపంచ తెలుగు మహసభల నిర్వహణ చర్చలు ఆంగ్లంలోనా? సభలను బహిష్కరించాలి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌21: ప్రపంచ తెలుగు మహాసభలు కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీగా మారాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు. సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ తెలుగు మహాసభలను నామామాత్రంగా నిర్వహించాలని ప్రభుత్వం కుట్ర పనుతోందని విమర్శించారు. ఈ మహసభలను ఘనంగా నిర్వహించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని అన్నారు. తెలుగు మహసభల నిర్వహణ చర్చ ఆంగ్లంలో జరుగడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్వహణ సక్రమంగా లేనందున ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. దినదినం తెలుగు బాష ప్రాధాన్యత తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు బాష ప్రాధాన్యంను రోజురోజుకు ప్రభుత్వమే దిగజార్చుతోందని విమర్శించారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటాలే తప్ప తగ్గించవద్దని ఆయన అన్నారు. ప్రభుత్వ అధినేతకే తెలుగు సక్రమంగా రాదని ఎద్దేవా చేశారు, ఇక ఆయనేమి తెలుగు గొప్ప తనానికి పాటుపడతారని విమర్శించారు. ప్రతి స్కూల్‌లో తెలుగు సబ్జెక్టును ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు