కాంగ్రెస్‌తో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం: ఎర్రబెల్లి
హైదరాబాద్: తెరాస అధినేత కేసీఆర్‌పై తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు విరుచుకుపడ్డారు. తెలుగుదేశాన్ని బలహీనపరచటమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో కలిసి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం పేరిట తెలంగాణ ప్రజలను 12 ఏళ్లుగా కేసీఆర్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మెను మరో వారం రోజులు పొడిగించి ఉంటే అప్పుడే తెలంగాణ వచ్చేదన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నందునే ప్యాకేజీల కోసం కాంగ్రెస్‌ను కేసీఆర్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పెద్దలతో చర్చల పేరిట కాలయాపన చేశారని విమర్శించారు. తెరేపాపై నమ్మకంతో ప్రజలు చంద్రబాబుకు తెలంగాణలో బ్రహ్మరదం పడుతున్నారని అన్నారు.



