బైక్–ఎక్స్‌ఎల్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

సిరికొండ, ఆగస్టు 9 (జనం సాక్షి): సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామ పరిధిలోని రామాలయం సమీపంలో ఆదివారం బైక్, ఎక్స్‌ఎల్ వాహనం ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గడ్కోల్‌కు చెందిన రాజు, పల్లికొండ నర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజు బైక్‌పై వెళ్తుండగా, పల్లికొండ నర్సయ్య ఎక్స్‌ఎల్ వాహనంపై వస్తున్న సమయంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కొద్దిసేపు రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



