కాంగ్రెస్‌ను ఆదరించాలి : రాఘువీరారెడ్డి

తిరుపతి,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ను ఎపి ప్రజలు ఆదరించాలంటూ.. పిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి కోరారు. శనివారం ఉదయం రఘువీరా రెడ్డి ప్రెస్‌విూట్‌లో మాట్లాడుతూ…  తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక ¬దా భరోసా యాత్రలో ఎఐసిసి అధ్యక్షులు రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగంపై హర్షం వ్యక్తం చేశారు. రాహుల్‌ ప్రసంగంతో ప్రజల్లో భరోసా ఏర్పడిందన్నారు.19 న మడకశిరలో ప్రారంభమైన ప్రత్యేక ¬దా భరోసా ప్రజా యాత్ర  చిత్తూరు జిల్లాలోకి చేరిందని చెప్పారు. మొదటి రోజున కర్నాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ పరమేశ్వర, రాష్ట్ర మంత్రి డికె.శివకుమార్‌లు వచ్చారని తెలిపారు. రాష్ట్ర ఇంచార్జి ఉమెన్‌ చాందీ, ఎఐసిసి సెక్రెటరీ లు వచ్చారని, ఈ భరోసా యాత్రలో భాగస్వామ్యమయ్యేందుకు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిన్నటి రోజు తిరుపతికి రావడం ఆనందదాయకమని చెప్పారు. కాంగ్రెస్‌ను ఆదరించాలంటూ.. ఎపి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. యువ భారత దేశానికి.. రాహుల్‌ గాంధీ సామర్ధ్యం ఉన్న నాయకుడని రఘువీరా వ్యాఖ్యానించారు.  దేశంలో అన్ని వర్గాలకు సంక్షేమం చేకూరాలంటే రాహుల్‌గాంధీ నేతృత్వంలోని యువ నాయకత్వం అవసరమని .రఘువీరారెడ్డి అన్నారు. హుల్‌ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ‘ప్రత్యేక ¬దా’ ఇచ్చే ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తుందన్నారు. దేశంలోని ప్రతి గుండె రాహుల్‌గాంధీనే శ్వాసగా ఎదురు చూస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ జాతీయ ప్లీనరీలోనూ ¬దా అంశంపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఏపీని దేశంలో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో రాహుల్‌గాంధీ ముందుకెళ్తున్నారన్నారు.

తాజావార్తలు