కాంగ్రెస్‌లో కరెంటు చిచ్చు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌పార్టీలో కరెంటు చిచ్చు మొదలైంది. కరెంట్‌ ఛార్జీలను పెంచడంపై మంత్రులు ,పార్టీ సీనియర్‌ నేతలు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై మండిపడుతున్నారు. సీఎం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ,ఎవరిని అడిగి ,ఎవరితో విచారించి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రులు బొత్స సత్యనారాయణ , కేంద్రమంత్రి చిరంజీవి, సీనియర్‌ నేత వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.