కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కయ్యాయి : హరీష్‌రావు

హైదరాబాద్‌: ఎఫ్‌డీఐల విషయంలో కాంగ్రెస్‌, టీడీపీలు కుమ్మక్కయ్యాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో టీడీపీ కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించిందని ఆయన విమర్శించారు.టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే ఆపార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు దేవేందర్‌గౌడ్‌, గుండు సుధారాణి, సుజనాచౌదరీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని ఆయన దుయ్యబట్టారు. పొద్దున లేస్తేనే కాంగ్రెస్‌ను తిట్టిపోసే చంద్రబాబు ఢిల్లీలో కాంగ్రెస్‌కు సపోర్టు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబుది రెండు నాల్కలధోరణి అని విమర్శించారు.