కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని బిగ్‌ షాక్‌

share on facebook

ఎస్పీ నుంచి రాజ్యసభకు కపిల్‌ సిబల్‌ నామినేషన్‌
కాంగ్రెస్‌ పార్టీకి 16ననే రాజీనామా చేశానని వెల్లడి
న్యూఢల్లీి,మే25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఈ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ,సీనియర్‌ లాయర్‌ కపిల్‌ సిబల్‌ హస్తానికి చేయిచ్చి, సైకిల్‌ ఎక్కారు. దీంతో కాంగ్రెస్‌కు భారీ షాక్‌ తగిలినట్టయ్యింది. పార్టీ సీనియర్‌ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, పేరు మోసిన న్యాయవాది కపిల్‌ సిబల్‌ పార్టీకి హఠాత్తుగా రాజీనామా చేసేశారు. చేయడమే కాదు.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో యూపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా నామినేషన్‌
కూడా దాఖలు చేసేశారు. అంతేగాకుండా సమాజ్‌ వాదీ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 16 వ తేదీనే.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు కపిల్‌ సిబల్‌ తెలిపారు. నామినేషన్‌ సమయంలో కపిల్‌ సిబల్‌ వెంట ఎస్పీ నాయకులు రాంగోపాల్‌ యాదవ్‌, ఉత్తమ్‌ పటేల్‌ సహా పలువురు నేతలు ఉన్నారు. సమాజ్‌ వాదీ పార్టీ మరో ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కపిల్‌ సిబల్‌తో పాటు జావేద్‌ అలీ, డిరపుల్‌ యాదవ్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేసింది. సమాజ్‌వాదీ మద్దతుతో కపిల్‌ సిబల్‌ రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేశారని సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు. మరో ఇద్దర్ని కూడా తాము రాజ్యసభకు నామినేట్‌ చేసామని ప్రకటించారు. కపిల్‌ సిబల్‌ పేరు మోసిన లాయర్‌. పార్లమెంట్‌లో ఆయన సమర్థవంతంగా సమస్యలను ప్రస్తావించగలరు. సమాజ్‌వాదీ తరపున, ఆయన తరపున సమస్యలను ప్రస్తావిస్తారని మేము ఆశిస్తున్నామని అఖిలేశ్‌ ప్రకటించారు.

Other News

Comments are closed.